టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన కోట్లాది రూపాయల భారాన్ని మేమే మోశాం: జగ‌న్

15-08-2021 Sun 12:04 | Andhra
  • హక్కులు అందరికీ సమానంగా అందాలి
  • పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించా
  • టీడీపీ ప్రభుత్వం రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టింది
  • రూ.9వేల కోట్ల ఉచిత విద్యుత్‌, రూ.324 కోట్ల విత్తన బకాయిలు చెల్లించ‌లేదు
విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని, తాము రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించానని తెలిపారు.

వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విష‌యాల‌ను తెలుసుకున్నాన‌ని అన్నారు. మ‌హిళ‌లు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధిని సాధించాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు.  త‌మ ప్ర‌భుత్వం వ్యవసాయ రంగానికి రూ.83వేల కోట్లు ఖర్చు చేసింద‌ని జ‌గ‌న్ చెప్పారు.  

రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని,  ధాన్యం సేకరణ, కొనుగోళ్ల కోసం రూ.33వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలతో పాటు చెల్లించకుండా వదిలేసిన రూ.9వేల కోట్ల ఉచిత విద్యుత్‌, రూ.324 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా తామే మోశామ‌ని తెలిపారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలని చెప్పారు.  గ్రామ సచివాలయాల్లో 500పైగా పౌరసేవలతో సరికొత్త విప్లవానికి నాంది పలికామని చెప్పారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

రాష్ట్రంలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నామని తెలిపారు. జగనన్న గోరుముద్ద ప‌థ‌కం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చామ‌ని తెలిపారు.  5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామ‌ని ఆయ‌న చెప్పారు.
JaganYSRCPTelugudesam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more